పత్తి పంటకు మద్దతు ధర పెంపు
BHNG: పత్తికి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను పెంచింది. గత సంవత్సరం కిలోకు ₹7,521గా ఉన్న మద్దతు ధరను ఈ సంవత్సరం రూ. 8,110గా ప్రభుత్వం నిర్ణయించిందని ఆలేరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే రూ. 589లు పెరిగిందని, దళారీల అవకతవకలు అరికట్టే ఉద్దేశంతో “కపాస్ కిసాన్” యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అన్నారు.