పాచిపెంట ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

పాచిపెంట ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

VZNR: పాచిపెంట మండలంలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. చర్చిలో వేకువజాము నుంచి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పాచిపెంట మండల కేంద్రం చర్చి వద్ద నుంచి కోడికాళ్ళ వలస గ్రామ సమీపంలో ఉన్న కల్వరి కొండ వరకు భక్తి పాటలు నడుమ క్రైస్తవులు ర్యాలీ చేశారు. మండల పరిధి గ్రామాల నుంచి క్రైస్తవులు ర్యాలీలో పాల్గొన్నారు.