ఈనెల 3న లింబాద్రిగుట్ట కొండ ప్రదక్షిణ

ఈనెల 3న లింబాద్రిగుట్ట కొండ ప్రదక్షిణ

NZB: భీమగల్ లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 3న కొండ ప్రదక్షిణ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. గుట్టపై ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి ఉదయం 11 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.