పాఠశాల ఆవరణలో విద్యార్థులతో శుభ్రత పనులు
ATP: పెద్దవడుగూరు మండలం లక్ష్యం పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కొందరు విద్యార్థులతో పాఠశాలలో పరిశుభ్రత పనులను చేయించడం తగదని గ్రామస్తులు ఉపాధ్యాయులపై మండిపడుతున్నారు. శుక్రవారం విద్యార్థులు చేస్తున్న పనులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.