డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి
HNK: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఏఎల్ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 18 నుంచి డిసెంబర్ 15 వరకు 116 కేంద్రాల్లో 1,35,461 మంది విద్యార్థులు రాయనున్నారు. హాల్ టికెట్లు 15 నుంచి కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు.