అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
CTR: పుంగనూరు పట్టణంలోని బసవరాజు బాలుర కళాశాలలో బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యాయమూర్తి కృష్ణవంశీ హాజరయ్యారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మానవ హక్కుల ప్రాధాన్యతను, వాటి పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి ఆమోదించిందని తెలిపారు.