మహిళా భద్రతపై విస్తృత అవగాహన: ఎస్సై

SKLM: కళాశాల విద్యార్థులకు మహిళ భద్రతపై మందస పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పించారు. మందస గ్రామంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సంకల్పం, నారీ శక్తి కార్యక్రమంలో మందస ఎస్సై కె. కృష్ణ ప్రసాద్ మహిళ భద్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన జరిగే దుష్పరిణామాలు గూర్చి వివరించారు. సైబర్ నేరాలు, శక్తి యాప్ పై అవగాహన కల్పించారు.