సర్పంచ్ అభ్యర్థి ఇంటికి నిప్పు..!
TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో భట్టి, పొంగులేటి వర్గాలు సర్పంచ్ పోటీలో ఉన్నాయి. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణలు తలెత్తి... భట్టి వర్గానికి చెందిన సింగాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి పొంగులేటి వర్గీయులు నిప్పుపెట్టారు.