సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ
HNK: హనుమకొండ కనకదుర్గ కాలనీలోని తమ నివాసంలో అర్హులైన లబ్ధిదారులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.