భారీ వర్షాలు.. జిల్లాకు ఎల్లో అలర్ట్

ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రానున్న నాలుగు రోజులూ వర్ష సూచనలున్నట్లు రేకులకుంట వాతావరణ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు డా. విజయ శంకరబాబు, డా.జి. నారాయణస్వామి తెలిపారు. నేడు ‘పింక్ అలర్ట్’ కింద కొన్ని అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 6, 7, 8 తేదీల్లో ఎల్లో అలర్ట్ కింద మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు.