దువ్వూరులో పండుగ వేళ డ్రోన్లతో పర్యవేక్షణ
కడప జిల్లాలోని దువ్వూరు మండలం కృష్ణంపల్లి ఉరుసు సందర్భంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను నివారించేందుకు దువ్వూరు ఎస్సై ధనంజయుడు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.