ఎయిమ్స్‌లో ఉద్యోగాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

ఎయిమ్స్‌లో ఉద్యోగాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

GNTR: ఎయిమ్స్ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. SI వెంకట్ మాట్లాడుతూ.. త్రినాథ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా యర్రబాలెంకు చెందిన వెలంగిని రాజు అనే వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆరుగురి నుంచి 12 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు.