సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన కేసీఆర్

SDPT: మాజీ ఎంపీ, సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ మట్టి బిడ్డ, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన నేత సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ తెలిపారు.