వేయి స్తంభాల దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

వేయి స్తంభాల దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

హనుమకొండ జిల్లా కేంద్రంలోని 1000 స్తంభాల దేవాలయాన్ని శనివారం సాయంత్రం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. బతుకమ్మ ఆటపాటలకు అనుగుణంగా పరిసర ప్రాంతాలను మరింతగా శుభ్రం చేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఆదివారం నుంచి జరుగనున్న బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఛాహత్ బాజ్పాయి, మేయర్ సుధారాణి పాల్గొన్నారు.