'అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని శిక్షించాలి'

SDPT: కొండపాక మండలంలోని ధమ్మక్కపల్లి గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ధ్వంసం ఖండిస్తూ దుద్దెడ గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకీ చంద్ర బాను మాట్లాడుతూ.. నవీన యుగములో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని అని గుర్తించబడిన సమయంలో ఆయన విగ్రహాన్ని కూల్చివేయడం సమంజసమైనది కాదు అని అన్నారు.