VIDEO: 'ఇళ్లు గడవకపోవటంతో దొంగతనం'
ప్రకాశం: కొమరోలు మండలం గోనపల్లె గ్రామం వద్ద బొప్పాయి కాయలు అమ్ముకుంటున్న మహిళ మెడలో గతనెల 11వ తేదీన 3 తులాల బంగారు ఆభరణాన్ని ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు లాక్కుని వెళ్లారు. దుండగులు కడప జిల్లాకు చెందిన వారని, ఇళ్లు గడవక ఒంటరి మహిళలను టార్గెట్ చేసినట్లు సీఐ రామకోటయ్య తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.