బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరిన కాసు
పల్నాడు అభివృద్ధికి కాసు కుటుంబం చేసిన కృషిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. మాచర్లలోనైనా, మీడియాలోనైనా లెక్కలతో వచ్చి, ఒక్కడినే తేల్చుకుని వెళతానని అన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న పిన్నెల్లి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.