స్కూల్ వద్ద సీపీఎం నేతలు ఆందోళన

ప్రకాశం: చీరాల కస్తూరిబాయి గాంధీ ఉన్నత పాఠశాల ముందు బుధవారం సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న పుష్పలతను అక్రమంగా తొలగించారని అన్నారు. విద్యాశాఖ అధికారి మరియు హెడ్‌మాస్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.