బల్లికురవలో మండల సర్వసభ్య సమావేశం

బల్లికురవలో మండల సర్వసభ్య సమావేశం

BPT: బల్లికురవ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా తాగునీటి ఎద్దడి, రహదారుల మరమ్మతులు, ఉపాధి హామీ పథకం పనుల పురోగతిని అధికారులు వివరించారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు.