'శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి'

CTR: స్కిల్ ఆఫ్ చిత్తూరు ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై పూర్తి అవగాహన పెంపునకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో వ్యవసాయ శాఖ ద్వారా స్కిల్ ఆఫ్ చిత్తూరు డిజిటల్ ట్రైనింగ్‌కు సంబంధించి రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.