9మందిపై పోలీసు కేసు నమోదు
VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోని గవరపాలెంలో భూ రీ సర్వే సందర్బంగా ఇరువర్గాలు దాడి చేసుకున్న ఘటనలో 9మందిపై కేసున మోదు చేసినట్లు ఎస్సై ఎన్.జోగారావు శుక్రవారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన డి. శ్రీనివాసరావు, డి.వి.అప్పారావు భూముల సర్వే నిర్వహించారు. ఇది మాదంటే మాదని ఇరువర్గాలు కొట్టుకొన్నారు. ఈ దాడిలో అప్పారావుతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి.