'రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదు'

'రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదు'

RR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ సునీత శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు రోడ్డు మీద గుంతలు తీయడం, రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయడం కానీ చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.