నిరంతరాయంగా వెలుగుతూ ఆగిపోయాయి..

SKLM: నగరపాలక సంస్థ, 50వ డివిజన్ సీపన్నాయుడుపేట, బైరివానిపేట గ్రామాల్లో గత 2 నెలలుగా విద్యుత్ వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. కార్పొరేషన్ కార్మికులు 52 రోజులు పాటు బంద్‌లో ఉండగా వీధిదీపాలు ఆర్పేందుకు ఎవరూ రాకపోవడంతో నిరంతరాయంగా వెలుగుతున్నాయి. దీంతో చాలావరకు వీధిదీపాలు కాలిపోయాయని, చీకటితో సావాసం చేయవలసి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.