'అమరావతి కథ అంతులేని కథలా మారింది'

'అమరావతి కథ అంతులేని కథలా మారింది'

GNTR: అమరావతి కథ అంతులేని కథలా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. "అమరావతిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు దోచుకుంటున్నారు. మొదటి దశలో 50వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు రెండోవిడత ల్యాండ్ పూలింగ్ చేస్తారట. 7 గ్రామాల్లో 20వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. మొదటివిడత రైతుల భూములను మళ్లీ లాక్కోవడం సరికాదు" అని ఆయన అన్నారు.