ఉమెన్ అండ్ సేఫ్టీ నూతన కార్యాలయం ప్రారంభం

ఉమెన్ అండ్ సేఫ్టీ నూతన కార్యాలయం ప్రారంభం

AP: తాడేపల్లిలో ఉమెన్ అండ్ సేఫ్టీ నూతన కార్యాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యాలయాన్ని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తాజాగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు శక్తి టీమ్‌లు పహారా కాస్తున్నట్లు తెలిపారు. మహిళలు, బాలికపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.