చిరంజీవి పుట్టినరోజున ఆయుష్ హోమం

చిరంజీవి పుట్టినరోజున ఆయుష్ హోమం

కృష్ణా: మోపిదేవిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజలు చేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో మోపిదేవి మండలం చిరంజీవి యువత ఆధ్వర్యంలో చిరంజీవి పేరిట ఆయుష్ హోమం నిర్వహించగా ఎమ్మెల్యే పూర్ణాహుతి సమర్పించారు.