బాలికకు ప్రేమపేరుతో బెదిరింపు.. ఐదేళ్లు జైలు శిక్ష

బాలికకు ప్రేమపేరుతో బెదిరింపు.. ఐదేళ్లు జైలు శిక్ష

NLR: దామరమడుగు పల్లిపాలెం గ్రామానికి చెందిన పొట్లూరి ప్రసాద్‌కు పోక్సో కేసులో ఐదేళ్లు జైలు శిక్ష రూ.37వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. పల్లిపాలెంకు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ ప్రేమించకపోతే.. తన పేరు రాసి చనిపోతానని బెదిరించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదేళ్లు జైలు శిక్షవిధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.