భారీ వర్షాల హెచ్చరిక

WGL: ఉమ్మడి జిల్లాలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు.