SP కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు

NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ చూచనల మేరకు ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయ శంకర్ సార్ చిత్ర పటానికి అడిషనల్ ఎస్పీ రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేశాడని రాష్ట్ర ఆవిర్భానికి కృషి, సేవలు మరవలేమని కోనియాడారు.