టీడీపీ నేతకు జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శ

ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దవడుగూరు మండలంలో పర్యటించారు. రావులుడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. సర్జరీ తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సోమశేఖర్ రెడ్డిని జేసీ పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.