మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలంలో తాగునీటి సమస్య రాకుండా పాలకవర్గం సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ బీసీ కాలనీలో కౌన్సిలర్ స్వప్న ఆధ్వర్యంలో నూతన బోర్ వెల్ పనులను నిర్వహించారు. పుష్కలంగా నీరు రావడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.