నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేష్

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేష్

నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాను ఏ సినిమానీ నిర్మించడం లేదని తెలిపాడు. అలాగే, ఎవరితోనైనా సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పాడు. తాను సినిమా నిర్మించనున్నట్లు వార్తలు రాస్తూ తనను ఇబ్బంది పెట్టొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ తనకు ఉండాలని ఆకాంక్షించాడు.