అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు పట్టివేత

MHBD: నరసింహులపేట మండల కేంద్రంలోని రామన్నగూడెం గ్రామ శివారులోని ఆకేరు వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.