VIDEO: ఆర్టిజన్ కార్మికుల వంటా వార్పు
MNCL: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల జిల్లాలో ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా గురువారం వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలని, ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, వేతన సవరణ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు.