విధులలో మార్పు చేయాలని సవివాలయ ఉద్యోగుల వినతి

VZM: మున్సిపల్ కమీషనర్ పి.నల్లనయ్యను బుధవారం ఆయన కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కలసి విధుల్లో మార్పులు చేయాలని కోరుతూ వినితిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1.2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి సర్వేలు చేయడం వంటి భారం నుంచి వారిని విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.