గ్రామైక్య సంఘానికి భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే

గ్రామైక్య సంఘానికి భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే

JGN: రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన ప్రగతి గ్రామైక్య సంఘం సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామైక్య సంఘానికి భవనం మంజూరు చేయాలని కోరగా వెంటనే ఎమ్మెల్యే రూ.10 లక్షల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలని వారికి సూచించారు.