ఇందిరా మహిళా శక్తి చీరల పంపకం
SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఇందిరా మహిళా శక్తి చీరలను ఆదివారం కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు గడ్డం మధుకర్ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. సుజాత, రేఖ పద్మ ఉన్నారు.