రేషన్ డీలర్‌తో సమస్యలా.. 1967కు ఫిర్యాదు చేయండి!

రేషన్ డీలర్‌తో సమస్యలా.. 1967కు ఫిర్యాదు చేయండి!

NLG: రేషన్ సరుకులు మీ హక్కు, డీలర్ చేసే సాయం కాదు. తూకంలో తేడా ఉన్నా, డీలర్ దురుసుగా ప్రవర్తించినా వెంటనే ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖ టోల్ ఫ్రీ నంబర్‌: 1967కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ విషయంలో గ్రామీణ ప్రజానీకం అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ పౌరసరఫరాల శాఖ పోర్టల్ ద్వారా, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడే డీలర్‌పై చర్యలు తీసుకుంటారు.