పాలెం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ
NLG: అనుముల మండలం పాలెం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బిల్లకండి శ్రీను పాల్గొన్ని చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు హరిబాబు, కాట్నం సైది బాబు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.