దోమల నివారణకు ప్రజలతో ప్రతిజ్ఞ

ASR: జీకేవీధి మండలం సీలేరు పీహెచ్‌సీ పరిధిలో బుధవారం ప్రపంచ దోమల నివారణ దినోత్సవం నిర్వహించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి దోమల నివారణకు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. దోమల నివారణకు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. దోమలు నివారిస్తే పలు రకాల వ్యాధులను నివారించడం జరుగుతుందని తెలిపారు