పొగాకు బోర్డు ముందు నిరసన చేసిన మాజీ మంత్రి

పొగాకు బోర్డు ముందు నిరసన చేసిన మాజీ మంత్రి

ప్రకాశం: మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు బోర్డు వద్ద గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ సంతనూతలపాడు ఇంఛార్జ్ మేరుగు నాగార్జున ఆందోళనకు దిగారు. పొగాకు రైతులతో కలిసి నిరసన తెలిపారు. పొగాకు ధర రోజురోజుకు పతనమవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనీస మద్దతు ధర కేటాయించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.