మలక్ పేటలో భారీగా ట్రాఫిక్ జామ్

HYD: మలక్ పేట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ ఘాట్- మలక్ పేట మార్గంలోని ఫ్లైఓవర్ వద్ద ఉన్న మ్యాన్ హోల్ పొంగుతోంది. నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి మలక్ పేట రైల్వే బ్రిడ్జి వరకు వరద నీరు ముంచెత్తింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. రహదారి పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.