'ఆత్మీయ భరోసా పథకం అమలు పరచాలి'

RR: వ్యవసాయ కార్మిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని బీకేయంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు తెలిపారు. సోమవారం శంషాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న పథకాన్ని అమలు పరచాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు.