'తాగునీటి సమస్య లేకుండా చూడాలి'

'తాగునీటి సమస్య లేకుండా చూడాలి'

ADB: రానున్న వేసవిలో ప్రజలకు తాగునిటీ సమస్యలు లేకుండా చూడాలని భీంపూర్ మండలం గుంజాల సర్పంచ్ మడావి వినోద్ సూచించారు. మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వినోద్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెల కొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సమావేశంలో భగీరథ ఏఈ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.