VIDEO: వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు
ములుగు: తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మహా జాతర సమయం దగ్గరపడటంతో ముందస్తుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు పగిడిద్దరాజు, గోవిందరాజుల నూతన గద్దెలను కూడా దర్శించుకున్నారు.