యార్లగడ్డలో జనసేనలో చేరిన యువకులు

యార్లగడ్డలో జనసేనలో చేరిన యువకులు

కృష్ణా: చల్లపల్లి మండలం యార్లగడ్డలో గురువారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు శిబిరం నిర్వహించారు. గ్రామానికి చెందిన పోతన సాయి, మరికొందరు యువకులు జనసేన పార్టీ సభ్యత్వం పొందారు. వారికి పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు తోట మురళీకృష్ణ, మిరియాల జితేంద్ర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి పీఏసీఎస్ ఛైర్మన్ బొందలపాటి వీరబాబు, పసుపులేటి రవికుమార్ పాల్గొన్నారు.