స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

WNP: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం అన్నిశాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ శాఖ చూసుకోవాలని, సమరయోధులకు సన్మానం, ప్రోటోకాల్ తదితర బాధ్యతలను ఆర్డీవో నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు.