పదోన్నతులు బాధ్యతలు మరింత పెంచుతాయి: ఎస్పీ
NRPT: పదోన్నతులు ఉద్యోగుల బాధ్యతలు మరింత పెంచుతాయని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్‌గా సోమవారం పదోన్నతి పొందారు. ఈ మేరకు ఎస్పీ ఆయనకు బ్యాడ్జీని అలంకరించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు.