గుర్తుతెలియని మృతదేహం లభ్యం
KMR: ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.