VIDEO: భక్తుల రద్దీతో కిటకటలాడిన మరిడమ్మ దేవాలయం

VIDEO: భక్తుల రద్దీతో కిటకటలాడిన మరిడమ్మ దేవాలయం

AKP: నర్సీపట్నంలో శ్రీ మరిడమ్మ ఆలయం వద్ద ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. పండగ మరో రెండు రోజులు జరగనున్న నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. టౌన్ పోలీసులు ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.